నకిలీ వార్తలు, వివాదాస్పద పోస్టులపై సోషల్ నెట్వర్క్స్ కొరడా
జుళిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో మరింత కఠినంగా
వ్యవహరిస్తున్నాయి. పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవటంతో
పాటు..వారి అకౌంట్లపై నిషేధం విధిస్తున్నాయి. ఈ జాబితాలో రాజకీయనాయకులు
ఉన్నా ఉపేక్షించట్లేదు. తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన వాట్సాప్
అకౌంట్‌పై ఆ సంస్థ వేటు వేసింది. సీఎం రమేష్ వాట్సాప్ సేవలను వాడుకునే
హక్కును కోల్పోయారని ఆ సంస్థ వివరించింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని
రాజకీయనాయకుల్లో వాట్సాప్ నిషేధానికి గురైన మొట్ట మొదటి వ్యక్తి సీఎం
రమేష్.
No comments:
Post a Comment