ఇప్పటి తరం హీరోయిన్లను చూస్తుంటే ఒళ్లు మండిపోతుందంటూ చివాట్లు
పెట్టాడు బాలు. వాళ్ల మాటతీరు.. బయటికి వచ్చినపుడు వేసుకుంటున్న
బట్టలు చూస్తుంటే మండిపోతుందంటున్నాడు ఈ లెజెండరీ సింగర్. ఇక దర్శక
నిర్మాతలు కూడా అలాగే మారిపోయారని.. పొట్టి బట్టలు వేసుకుంటున్న
వాళ్లకే వాళ్లు కూడా అవకాశాలు ఇస్తారా అంటూ నిలదీస్తున్నాడు బాలు.
పాశ్చాత్య సినిమాలకు అలవాటు పడిపోయి.. వాళ్లు ఫాలో అవుతుంటే తెలుగు
సినిమా స్థాయి దిగజారిపోతుందంటూ బాధ పడుతున్నాడు బాలు. ఇప్పటికీ తాను ఇదే
మాట మీదున్నానని.. ఎవరేం అనుకున్నా కూడా తాను మారలేనని.. తన లాంటి వాడు
కూడా మాట్లాడకపోతే ఈ తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికి పడిపోతుందో అనే భయం
ఉందంటున్నాడు బాలు.
No comments:
Post a Comment