04/02/2019

GHMC Demolishes Actor Nandamuri Taraka Ratna's Restaurant | for Illegal Actions

టాలీవుడ్ యాక్టర్ నందమూరి తారకరత్నకు జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఉన్న తారక్‌కు చెందిన 'ఫ్రెండ్స్ డ్రైవ్ ఇన్' రెస్టారెంట్‌ను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న తారకరత్న హుటాహుటిన రెస్టారెంట్ వద్దకు వచ్చి అధికారులను నిలదీశారు. ఐతే నిబంధనలను విరుద్ధంగా నడుపుతున్నారని ఫిర్యాదులు రావడం వల్లే కూల్చివేశామని వివరణ ఇచ్చారు. కూల్చివేత సందర్భంగా హోటల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని అనుమతులు తీసుకున్నాకే రెస్టారెంట్ నిర్వహిస్తున్నామని జీహెచ్‌ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా అధికారులు తమ పని తాము కానిచ్చారు.
రాత్రివేళ రెస్టారెంట్‌లో సౌండ్ సిస్టమ్‌తో ఇబ్బందులు సృష్టిస్తున్నారని, తాగుబోతుల ఆగడాలు సైతం పెరిగాయని కాలనీవాసులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారులు రెస్టారెంట్‌ను కూల్చివేసినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment