
ఏపీలో కొత్తగా అప్పడాలపై రాజకీయ దుమారం రేగింది. అదేంటి అప్పడాలకు రాజకీయాలకు లింకేటని అనుకుంటున్నారా.. నిజమే అప్పడాలపై టీడీపీ - బీజేపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. అసలు విషయానికొస్తే.. చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన పసుపు కుంకుమ సభ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. విందులో వడ్డించిన అప్పడాలపై చంద్రబాబు ఫోటో ఉంది.. దానిపై థాంక్యూ సీఎం గారు.. ది లీడర్ అని ముద్రించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజాగా ఈ ఫోటోను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. ‘ఆశ-దోచే-అప్పడం బాబు..! కుర్చీ మీద ఆశతో రాష్ట్రాన్ని దోచి ప్రచార పిచ్చితో ఆఖరికీ అప్పడాలపై, టిష్యూ పేపర్‌లపై, బాత్రూం కమోడ్లపై కూడా ప్రచారం చేసుకుంటున్నావ్! ఇదేం పిచ్చి బాబు!?’ అంటూ ఎద్దేవా చేశారు. ఇక నెటిజన్ల ట్రోలింగ్స్ షరా మూమూలే. ఇటు వైసీపీ నేతలు కూడా ఇదేం పబ్లిసిటీ పిచ్చి బాబోయ్ అంటూ టార్గెట్ చేసింది.
ఆశ-దోచే-అప్పడం
బాబు..! కుర్చీ మీద ఆశతో రాష్ట్రాన్ని దోచి ప్రచార పిచ్చితో ఆఖరికి
అప్పడాలపై,టిష్యూ పేపర్ లపై బాత్రూం… https://t.co/ADGj9WSnf0
— Kanna Lakshmi Narayana (@klnbjp) 1549245121000
No comments:
Post a Comment