ఓ ఓ …
ఆ సింగిడిలో రంగులనే దూసితెచ్చి దూసితెచ్చి
తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి
పచ్చి తంగిడితో గుమ్మాడి పూలు చేర్చి
బంగారు బతుకమ్మని ఇంటిలో పేర్చి
బంగారు బతుకమ్మని ఇంటిలో పేర్చి
ఆడబిడ్డల అరచేతులనే ఊయలకట్టి
వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకువచ్చి
పువ్వులనే పూజించే పండుగ తెచ్చే
ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచే
ఏటిగట్టు మీద పూలెన్నో నిన్నుపిలిచే
అందాల బతుకమ్మ రావే
తెలంగాణాలో పుట్టి పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే.. వటే
పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించే..నే
రేలారే రేలా రే రేలా రేలా రేలా రే ల
రే లా రే రే లా రే..రే ల రే రేలారే
పత్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా
గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా
కంది పువ్వులనే కంటి పాపలుగ
సీత జడ పూలే నీలో సిగ్గులుగా
తీరొక్కపూలు చేరి
నీ చిరలాగా మారి
ఆ ఆడబిడ్డలాగా
నిన్ను తీర్చి దిద్దుతుంటే
దారుల్లో ఊరేగ రావే..
తెలంగాణాలో పుట్టి పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే.. వటే
పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించే..నే
ఆ...
మెట్టినిల్లు వీడి చెల్లీ పుట్టినిల్లు చేరేవేళ
పట్టరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేనంట
పట్టణాలు వీడి జనం సొంతఊరు చేరే క్షణం
చిన్నబోయి ఉన్న గ్రామం సందడిగా మారేదినం
బ్రతుకు పండుగలో...
తెలంగాణాలో పుట్టి పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే.. వటే
ఓ ఓ ఓ ఓ .....
పూవుల జాబిలివే.. పున్నమి వాకిలివే
చీకటికే రంగులు పులిమావే
ఆడపడుచులు.. నీ.. కన్న తల్లులయి
పున్నమి రాతిరిలో జోలలు పాడుదురే
ఆట కొయిలాలే నీ.. అన్నాదమ్ములయి
కంటి రెప్పవలె నిన్ను కాపాడెదురె
ఏ తల్లి కడుపులోన నువ్వు పొందలేదే జన్మ
ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మా
జన్మ జన్మాల బంధానివి నీవై..
తెలంగాణాలో పుట్టి పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే.. వటే
గావురంగా పెరిగినీవు గడపలు దాటుతుంటే
మల్లిరా తల్లి అంటూ కళ్ళనీళ్లారగించి
చెరువును చేరుకొని తల్లి నిన్ను సాగనంప
చివరిపాటలతో నీటనిన్ను తోలుతుంటే
చెమ్మగిల్లెను కళ్ళే...
తెలంగాణాలో పుట్టి పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే.. వటే
పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించే..నే
పూవులా జాతరవే జమ్మీ పండుగవే
పాల పిట్టవులే మళ్ళీరావే
ఆ సింగిడిలో రంగులనే దూసితెచ్చి దూసితెచ్చి
తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి
పచ్చి తంగిడితో గుమ్మాడి పూలు చేర్చి
బంగారు బతుకమ్మని ఇంటిలో పేర్చి
బంగారు బతుకమ్మని ఇంటిలో పేర్చి
ఆడబిడ్డల అరచేతులనే ఊయలకట్టి
వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకువచ్చి
పువ్వులనే పూజించే పండుగ తెచ్చే
ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచే
ఏటిగట్టు మీద పూలెన్నో నిన్నుపిలిచే
అందాల బతుకమ్మ రావే
తెలంగాణాలో పుట్టి పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే.. వటే
పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించే..నే
రేలారే రేలా రే రేలా రేలా రేలా రే ల
రే లా రే రే లా రే..రే ల రే రేలారే
పత్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా
గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా
కంది పువ్వులనే కంటి పాపలుగ
సీత జడ పూలే నీలో సిగ్గులుగా
తీరొక్కపూలు చేరి
నీ చిరలాగా మారి
ఆ ఆడబిడ్డలాగా
నిన్ను తీర్చి దిద్దుతుంటే
దారుల్లో ఊరేగ రావే..
తెలంగాణాలో పుట్టి పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే.. వటే
పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించే..నే
ఆ...
మెట్టినిల్లు వీడి చెల్లీ పుట్టినిల్లు చేరేవేళ
పట్టరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేనంట
పట్టణాలు వీడి జనం సొంతఊరు చేరే క్షణం
చిన్నబోయి ఉన్న గ్రామం సందడిగా మారేదినం
బ్రతుకు పండుగలో...
తెలంగాణాలో పుట్టి పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే.. వటే
ఓ ఓ ఓ ఓ .....
పూవుల జాబిలివే.. పున్నమి వాకిలివే
చీకటికే రంగులు పులిమావే
ఆడపడుచులు.. నీ.. కన్న తల్లులయి
పున్నమి రాతిరిలో జోలలు పాడుదురే
ఆట కొయిలాలే నీ.. అన్నాదమ్ములయి
కంటి రెప్పవలె నిన్ను కాపాడెదురె
ఏ తల్లి కడుపులోన నువ్వు పొందలేదే జన్మ
ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మా
జన్మ జన్మాల బంధానివి నీవై..
తెలంగాణాలో పుట్టి పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే.. వటే
గావురంగా పెరిగినీవు గడపలు దాటుతుంటే
మల్లిరా తల్లి అంటూ కళ్ళనీళ్లారగించి
చెరువును చేరుకొని తల్లి నిన్ను సాగనంప
చివరిపాటలతో నీటనిన్ను తోలుతుంటే
చెమ్మగిల్లెను కళ్ళే...
తెలంగాణాలో పుట్టి పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే.. వటే
పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించే..నే
పూవులా జాతరవే జమ్మీ పండుగవే
పాల పిట్టవులే మళ్ళీరావే
No comments:
Post a Comment