
పక్కన కూర్చుంటే ముద్దు చేద్దామనుకున్నాడు. కానీ నిండా ముంచింది. అతడు చేసిన నిర్వాకాన్ని ఫొటో తీశాడు మరో వ్యక్తి. అది చూసిన అధికారులు ఉద్యోగం నించి పీకేసి ఇంటికి పంపించారు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్‌లోకి ఉపాధ్యాయుడు ఎక్కాడు. అతడితో పాటే కొండముచ్చు కూడా ఎక్కింది. కోతి చేష్టలు అని ఊరికే అనరు కదా. అందుకే అది వెళ్లి డ్రైవర్ ప్రకాష్ ఒడిలో కూర్చుంది. దాన్ని తీసుకెళ్లి స్టీరింగ్‌పై కూర్చోబెట్టాడు డ్రైవర్.
అసలే బస్ రష్‌గా ఉంది. దాంతో కోతి చేతికి స్టీరింగ్ ఇచ్చాడు డ్రైవర్. వద్దని ప్రయాణీకులు వారిస్తున్నా వినలేదు. అయితే ఈ తతంగాన్ని అంతా మరో ప్రయాణీకుడు తన ఫోన్‌ద్వారా వీడియో చిత్రీకరించాడు. ఆపై దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా రవాణా శాఖ అధికారులకు తెలిసి అతడిని డ్రైవర్ విధులనుంచి తొలగించింది. ఇప్పడు ఈ వీడియో వైరల్ అవుతోంది.
No comments:
Post a Comment