14/05/2017

Nargis Fakhri With Her Boyfriend Caught At Airport

'రాక్‌ ఆన్‌' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నర్గీస్‌ ఫాక్రీ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది కానీ నటనని అంత సీరియస్‌గా తీసుకోలేదు. అవకాశాలు వచ్చినప్పటికీ వదిలేసుకుని పెద్ద ప్లాన్స్‌ మీద దృష్టి పెట్టింది. యష్‌రాజ్‌ సంస్థకి వారసుడైన ఉదయ్‌ చోప్రాతో ఆమె అఫైర్‌ నడుపుతోందని చాలా కాలంగా వినిపిస్తోంది.

'ధూమ్‌' సిరీస్‌లో నటించిన ఉదయ్‌ చోప్రాని ఎన్ని సినిమాల్లో కనిపించినా జనం నటుడిగా గుర్తించడం లేదని అతను ఇక నటించనని ప్రకటించి సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కి గురయ్యాడు. ప్రస్తుతం అతనేమి చేస్తున్నాడనేది ఎవరికీ తెలియదు కానీ బాలీవుడ్‌ సౌండ్‌ పార్టీల్లో ఒకడని మాత్రం అందరికీ తెలుసు.

తన బాయ్‌ఫ్రెండ్‌ కేవలం తాత, తండ్రుల డబ్బులు ఖర్చుపెడుతూ తిరిగేవాడని చెప్పుకోవడం ఇష్టం లేకనో, మరి దేనికో ఉదయ్‌ గురించి టాపిక్‌ తెచ్చినపుడల్లా నర్గీస్‌ అవన్నీ పుకార్లని కొట్టి పారేసేది. అయితే ఉదయ్‌తో విదేశీ టూర్‌ వేసి వస్తూ ఎయిర్‌పోర్టులో ఫోటోగ్రాఫర్లకి దొరికేసింది. ముందు ఉదయ్‌ చోప్రా నవ్వుకుంటూ వెళుతోంటే, చోరీ చేసి పోలీసులకి దొరికిపోయిన నేరస్థురాలిలా ముఖం చున్నీతో కప్పేసుకుని ఫోటోగ్రాఫర్లని తప్పించుకోవాలని చూసింది.

అయితే ఈమధ్యే తన హెయిర్‌ స్టయిల్‌ని మార్చుకోవడంతో దానిని మాత్రం దాచలేక దొరికేసింది. అయినా బాయ్‌ఫ్రెండ్‌తో బయటకి వెళ్లి రావడాన్ని కూడా ముఖం కప్పుకు తిరిగేంత తప్పు అని భావిస్తున్నప్పుడు అతడితో అఫైర్‌ పెట్టుకోవడం దేనికో?

No comments:

Post a Comment