20/05/2017

పునాదుల్లో బంగారు నిధి : ప్రభుత్వానికి అప్పగించిన పేదరాలు



ఆమె నిరుపేద. జీవనం కూలీ పని. నివాసం పూరి గుడిసె. రోజువారీగా వచ్చే 100, 150 రూపాయలతో బతుకు ఈడ్చుతుంది. ఇంత నిరుపేదరాలికి గుప్త నిధి దొరికితే ఏం చేస్తుంది.. మిగతా జీవితం సంతోషంగా జీవిస్తుంది. బాదరబందీలు లేకుండా హ్యాపీగా గడిపేయొచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. మొత్తం బంగారాన్ని పోలీసులకు తన చేతులతో అందించింది. కర్నాటక రాష్ట్రం బెంగళూరికి 100కిలోమీటర్ల దూరంలోని బాణ సముద్ర అనే గ్రామంలో జరిగిన ఈ ఘటన జరిగింది. గ్రామంలో లక్ష్మమ్మ అనే మహిళ జీవిస్తుంది. వయస్సు 55 ఏళ్లు. తన పూరింటిని తీసేసి పక్కా ఇల్లు నిర్మాణం చేసుకోవాలని నిర్ణయించింది. తోటి కూలీలతో ఇంటికి పునాదులు తీస్తోంది. నాలుగు, ఐదు అడుగులు తొవ్వగానే కొన్ని నాణేలు బయటపడ్డాయి. మరింత తవ్వారు ఇంకొన్ని దొరికాయి. ఇలా 435కిపైగా నాణేలు బయటకొచ్చాయి. వాటిని శుభ్రం చేసింది. అంతే మెరుపు. అన్నీ బంగారు నాణేలు. ఒక్కోటి కనీసంగా రెండు గ్రాముల వరకు ఉంటుంది. మొత్తం 400 నాణేలు. మొత్తంగా ఇంచుమించు కేజీ వరకు ఉంటుందని భావించారు. మిగతా కూలీలు అందరూ కూడా వాటిని అమ్మేసి సొమ్ము చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఎవరి మాట వినకుండా ఆ బంగారు నాణేలను స్థానిక పోలీసులకు అప్పగించింది. వాటిని అక్కడి నుంచి పురావస్తు శాఖకు అప్పగించారు పోలీసులు. లక్ష్మమ్మ నిజాయితీని అందరూ అభినందనలు చెబుతున్నారు.


---V6News

No comments:

Post a Comment