దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు విచారణ కీలక మలుపు
తిరుగుతోంది. ఓటుకు కోట్లు కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని ఇంగ్లిష్
డెయిలీ డెక్కన్ క్రానికల్ ప్రచురించిన కథనం సంచలనం రేపుతోంది. ఈ కేసులో
అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో..
తార్నాకలోని మాల్కం టేలర్ అనే వ్యక్తి ఇంట్లో తీసిన వీడియో
బయటికొచ్చింది. 11 నిముషాల నిడివి గల ఈ వీడియోలో టీడీపీ నేత సెబాస్టియన్,
టీఆర్‌ఎస్ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను రూ.5 కోట్లకు కొనుగోలు
చేసేందుకు బేరసారాలు నడిపారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి
మద్దతు ఇచ్చేందుకు సెబాస్టియన్ స్టీఫెన్‌సన్‌తో బేరం మాట్లాడినట్టు ఈ
వీడియో ద్వారా తెలిసింది. (సార్ ఎవరు?)
అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇవ్వడానికి నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వస్తాడని సెబాస్టియన్ చెప్పినట్టు ఈ వీడియోలో స్పష్టమైంది. తొలుత 3.3 కోట్లకే బాబు ఒప్పుకున్నారని, కానీ తన సిఫారసుతో 5 కోట్లకు డీల్ ఓకే అయిందని సెబాస్టియన్ స్టీఫెన్ సన్‌తో చెప్పిన విషయం వెల్లడైంది. మిగతా సొమ్ముకు తనదే బాధ్యత అంటూ సెబాస్టియన్ హామీయిచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియో ఓటుకు కోట్లు కేసులో ప్రధాన సూత్రధారి ఎవరనే విషయం తెలియనుంది. ఇప్పటికే ఈ కేసులో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 సెబాస్టియన్, ఉదయసింహ, వేం నరేందర్‌రెడ్డి విచారణ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఈ కేసులో కీలకమైన చంద్రబాబు– స్టీఫెన్‌సన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ టేపును ప్రఖ్యాతి గాంచిన చండీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. అయినా ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. నాలుగేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో తాజాగా బయటపడిన వీడియో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి..!

No comments:
Post a Comment