29/01/2019

రాహుల్, ప్రియాంక గాంధీలు ఆర్నెళ్ళ తేడాతోనే పుట్టారా

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలు అధికారిక పత్రాల్లో తమ వాస్తవ పుట్టిన తేదీలనే పేర్కొంటున్నారా? అంటూ కొన్ని మితవాద గ్రూపుల సోషల్ మీడియా పేజీల్లో ప్రశ్నలు కనిపిస్తున్నాయి.
'వీకీపీడియా' ప్రకారం, రాహుల్, ప్రియాంకల పుట్టిన తేదీలకు మధ్య తేడా ఆర్నెల్లే ఉన్నట్లుగా చూపుతున్న ఒక స్క్రీన్ షాట్‌ను ఆ పేజీల్లో పోస్ట్ చేశారు.
దానిని వేలాది మంది ఇతర పేజీలలో షేర్ చేశారు.
'రాహుల్ గాంధీ పుట్టిన తేదీలో పెద్ద స్కాం ఉంది. ప్రియాంక జన్మించిన తర్వాత ఆరు నెలలకే రాహుల్ గాంధీ పుట్టారట" అంటూ ఆ స్క్రీన్ షాట్‌కు ఓ సందేశాన్ని జోడించి షేర్ చేశారు.
రాహుల్, ప్రియాంకల పుట్టిన తేదీల గురించి హిందీ టీవీ ఛానెల్ ఆజ్‌ తక్ కూడా ఓ కథనాన్ని ప్రసారం చేసిందంటూ మరో చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.

-BBC

No comments:

Post a Comment