17/10/2017

ఉద్యోగం కావాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందే

దరఖాస్తులో ఆధార్ తప్పనిసరి 

ఆధార్ అంటే ఇప్పుడు ప్రతి భారతీయుడి కి ఒక గుర్తింపు కార్డుగా మారింది. ఈ ఆధార్ ని అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల కి మన ప్రభుత్వం అనుసంధానించోకోమని చెప్పిన విషయం తెలిసిందే..


అయితే ఇకనుంచి ఉద్యోగాలకి కూడా ఈ ఆధార్ అనుసందానం తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే ఉద్యోగి సమాచారం డేటా బేస్ పైనే ఆధారపడనున్నాయి కనుక కంపెనీలు కూడా ఆధార్ నెంబర్ ఉద్యోగి నుంచి తీసుకుంటున్నాయి. 

వారం రోజులు జరిగే వెరిఫికేషన్ ఇప్పుడు పావు గంటలో 

గతంలో ఓ ఉద్యోగి గత చరిత్రపై విచారించేందుకు వారం రోజుల సమయం పడుతుండగా ఆధార్ డేటా సహాయం తో కేవలం పావుగంట సమయం లో గతం లో పనిచేసిన కంపెనీలు, పోలీసుల కేసులు తదితర వివరాలు తెలుస్తాయని , అందువల్లే ఆధార్ డేటాబేస్ వాడకం కంపనీల్లో తప్పనిసరి అని పలు కంపెనీలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. 

తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట 

తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇస్తారన్న అనుమానం లేకుండా ఉంటుందని.. ఆధార్ వెరిఫికేషన్ లో క్లియర్ అయితే 70శాతం అర్హత సాధించినట్లే అని రిక్రూట్మెంట్ సేవల సంస్థ "బెటర్ ప్లేస్" సిఇఓ సౌరబ్ తాండాన్ వెల్లడించారు  


No comments:

Post a Comment