22/05/2017

రాజధాని కారణంగా కోట్లు నష్టపోయిన కొమ్మినేని

రాజధాని రాకతో రైతుల భూముల విలువ ఎన్నోరెట్లు పెరిగిపోయిందన్న చంద్రబాబు వ్యాఖ్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అయితే కొమ్మినేని శ్రీనివాసరావు ఈ సందర్భంలో తన స్వీయ అనుభవాన్ని వ్యక్తీకరించారు.

రాజధాని ప్రాంతంలో తమ తాతలు సంపాదించిన భూములు ఉన్నాయన్నారు. రాజధాని రాక ముందు అక్కడ ఎకరం మూడు కోట్లు పలికిందని... ఇప్పుడు ఎకరం కోటి రూపాయలకు కొనేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. టీడీపీ నేతలు చెప్పినట్టు భూములు విలువ పెరిగి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. రాజధాని స్థల ఎంపిక , రైతుల నుంచి అన్నివేల ఎకరాలు భూములు తీసుకోవడం, అక్కడ జరుగుతున్న లావాదేవీలన్నింటిపైనా స్థానికంగా అనేక అనుమానాలున్నాయన్నారు.

రాజధానిని భూతల స్వర్గంగా నిర్మిస్తే అందరూ హర్షిస్తారని కానీ...తాత్కాలిక అసెంబ్లీ పేరుతోనే వెయ్యి కోట్లు దుబార చేసిన ప్రభుత్వం భూతల స్వర్గాన్ని నిర్మిస్తామంటే నమ్మే అవకాశంఎక్కడుందని కొమ్మినేని ప్రశ్నించారు. మొత్తం మీద రాజధాని రాక ముందు మూడు కోట్లు పలికిన భూమి... ఇప్పుడు కోటి రూపాయలు కూడా పలకడం లేదంటే కొమ్మినేని కుటుంబానికి చెందిన భూమి విలువ భారీగానే పడిపోయిందన్న మాట.

No comments:

Post a Comment