సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన వ్యాఖ్యలు బహిరంగంగానే. అదీ రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో విడుదల వేడుకలో. టీవీల్లో లక్షలాది మంది చూస్తుండగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు విన్న వారంతా అవాక్కయ్యారు. అవి కాస్తా మీడియాలో వచ్చాక పెద్ద దుమారమే చెలరేగింది. నిజంగా అక్కినేని నాగార్జున తాను నిర్మాతగా ఉన్న సినిమా ఆడియో ఫంక్షన్ లో ఓ సీనియర్ నటుడు మహిళలపై అభ్యంతరకరంగా మాట్లాడితే..అవి తప్పు అని భావించి ఉంటే అప్పటికప్పుడే స్పందించి ఉండాల్సింది. కానీ ఆయన అలా చేయలేదు. బహిరంగంగా చెప్పటానికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు చెప్పినట్లు ట్విట్టర్ ద్వారా అయినా ఖండించి ఉండాల్సింది.
కానీ ఈ ఈ వ్యవహారంపై దుమారం రేగిన తర్వాత..వ్యవహారం పోలీసు కేసు వరకూ హీరో నాగార్జున స్పందించకపోవటం కూడా చర్చనీయాంశంగా మారింది. చలపతిరావు వ్యాఖ్యలపై స్పందించిన నాగార్జున తన వ్యక్తిగత జీవితంలోనూ, తన సినిమాల్లోనూ మహిళలపట్ల గౌరవం ఉందంటూ ట్వీట్ చేశారు. మరోవైపు అసలు ఈ వివాదానికి కారణమైన అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అన్న మాటలపైనే ప్రధానంగా పలువురు మేధావులు, ప్రముఖ రచయిత్రులు, మహిళా సంఘాల నేతలు, ఇతర పెద్దలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మీడియా ఈ అంశాన్ని వదిలేసి ఉంటే..నాగార్జున కూడా మౌనంగా ఉండిపోయేవారన్న మాట. ఇది వివాదస్పదం కావటంతోనే ఆయన స్పందించారు.

No comments:
Post a Comment