మెరుపు వేగంతో వచ్చిన కారు క్షణాల్లో పిల్లర్‌ఢీకొట్టి నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ సమయంలో కారు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టు తేల్చారు. అంత వేగంతో వెళ్లి పిల్లర్‌ను ఢీకొట్టడంతో ఓపెన్ అయిన కారు బెలూన్ కూడా పేలిపోయింది. కారు ఇంజిన్ సీట్లలోకి వచ్చేసింది. దీంతో నిషిత్, రవివర్మల చాతీ చిద్రమైంది. పెద్ద శబ్ధంతో కారు పిల్లర్‌ను ఢీకొట్టగానే స్థానికులు అక్కడి వెళ్లి సహాయకచర్యలకు పూనుకున్నారు.
అయితే కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోవడం నిషిత్, రవివర్మ అందులో చిక్కుకుపోవడంతో వెలికితీయడం చాలా కష్టమైంది. స్పాట్‌లోనే నిషిత్ చనిపోగా... రవి వర్మలో కాస్త కదిలికలు కనిపించాయని ప్రత్యక్ష సాక్ష్యులు మీడియాతో చెప్పారు. వీరు ప్రయాణిస్తున్న బెంజ్ కారు విలువ రెండున్నర కోట్లుగా చెబుతున్నారు. ప్రమాద సమయంలో వీరిద్దరు సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు. ప్రమాదంలో చనిపోయిన నిషిత్, రవివర్మ ఇద్దరు చిన్నప్పటినుంచి క్లాస్‌మేట్స్.
రవివర్మ స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరు. ఇతడి తండ్రి ప్రముఖ పారిశ్రామికవేత్త కామని బాల మురళీకృష్ణ. పనిమీద రాత్రి బయటకు వెళ్లిన వీరద్దరు... వర్షం వస్తుండడంతో కొద్దిసేపు స్నేహితుడి ఇంట్లో ఉన్నారు. అనంతరం కారులో వేగంగా తిరుగుప్రయాణం అయ్యారు. ఇంతలోనే మృత్యువు కబలించింది. వీరు ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ 63 అనే కారు ప్రపంచంలోనే అత్యుత్తమైనది. సేప్టీ ఫీచర్స్ చాలా ఉంటాయి. కానీ 120 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీకొట్టడంతో వారిద్దరూ ప్రాణాలతో బయటపడలేకపోయారు.

No comments:
Post a Comment